Perni Nani : మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) పై కేసు నమోదైంది. ఆయన్ను ఏ6గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా పీఎస్‌లో పోలీసులు(Police) కేసు నమోదు చేశారు. పేర్ని నాని ఆదేశాల మేరకే లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారు. త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది. మరోవైపు రేషన్ బియ్యం (Ration rice) మాయం కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజులు రిమాండ్ విధించారు. దీంతో నిందితులను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు.













