ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో షాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. లోక్‌సభలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేవనెత్తిన ఓ ప్రశ్నకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే దేశ వ్యాప్తంగా అమలు చేయడం తప్ప.. ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా చేయడం సాధ్యం కాదని కేంద్రమంత్రి సృష్టం చేశారు. విశాఖపట్నంలో నెలకొల్పిన మెడిటెక్ జోన్ బాగా పని చేస్తోందని కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలతో వస్తే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గడ్కరీ తెలిపారు.













