Tullur : అతి త్వరలో తుళ్లూరులో ప్రారంభిస్తాం : బాలకృష్ణ
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని మరింత విస్తరించనున్నామని ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలిపారు. హైదరాబాద్లోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్ (Oncology Unit )ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. ఇవాళ పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. క్యాన్సర్ (Cancer) బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని పేర్కొన్నారు. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తుళ్లూరు (Tullur )లో మరో 8 నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని తెలిపారు.













