నూతన ఆవిష్కరణల అభివృద్ధికి కేఎల్ యూతో.. కాలిఫోర్నియో వర్సిటీ సంసిద్ధత
నూతన ఆవిష్కరణల అభివృద్ధికి తమ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియో విశ్వవిద్యాలయం సంసిద్ధత వ్యక్తం చేసిందని కేఎల్ అంతర్జాతీయ సంబంధాల డీన్. డా.కిశోర్‌బాబు తెలిపారు. అమెరికాలోని బర్కిలియాకు చెందిన కాలిఫోర్నియో విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సోలోమాన్ డార్విన్ తమ ప్రతినిధులు బృందంతో కలిసి తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేల్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. డీన్.డా. కిశోర్‌బాబుతో విద్య, పరిశోధనా కార్యకలాపాలపై చర్చించారు. నూతన ఆవిష్కరణల ద్వారా సాధించే ప్రగతి, ఆర్థికాభివృద్ధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరస్పరం విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడికి సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియో బృందాన్ని వీసీ డాక్టర్ పార్థసారథి వర్మ సత్కరించారు. ప్రొ.వీసీ డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.













