Raghu Ramakrishna Raju: ఆర్ఆర్ఆర్ కు అరుదైన గౌరవం.. ఏపీ డిప్యూటీ స్పీకర్ కు క్యాబినెట్ హోదా..
గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి కనుమూరి రఘురామకృష్ణరాజు (Kanumuru Raghu Rama Krishna Raju) . అయితే ఆ తర్వాత కూటమి వైపు చేరిన ఆర్ ఆర్ఆర్ (RRR) 2024 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం ( Undi assembly constituency) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్గా తన విధులు నిర్వహిస్తున్న రఘురామకృష్ణరాజుకు తాజాగా మరొక గౌరవం దక్కింది.
ప్రస్తుతం ఉప సభాపతిగా ( Deputy Speaker) ఉన్న ఆర్ఆర్ఆర్ కు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది.ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ చట్టంలోని ఆర్టికల్ 15 మేరకు రఘురామకృష్ణరాజుకు కేబినెట్ హోదాను ఇస్తున్నట్టు పేర్కొం ది. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఆ పదవిలో ఉన్నంత కాలం.. ఆయనకు ఈ హోదా వర్తిస్తుందని తెలిపింది. తాజాగా విడుదల చేసిన జీవోలో ఈ విషయాన్నీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ రాజకీయ కార్యదర్శి సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ఇక్కనుంచి రఘు రామ కృష్ణ రాజుకు కేబి నెట్ ర్యాంకుకు అనుగుణంగా ప్రొటోకాల్, భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది నిజంగా అతనికి దక్కిన అరుదైన గౌరవం అనడంలో సందేహం లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు విభజన తరవాత ఉప సభాపతులుగా చేసిన వారికి ఎవ్వరికీ ఈ గౌరవం దక్కలేదు. ఈ నిర్ణయం తీసుకోవడం తొలిసారి కవడమేకాక..రఘురామకృష్ణరాజు ఉప సభాపతిగా ఉన్నప్పుడు తీసుకోవడం గమనార్హం. అయితే గతంలో రఘురామకృష్ణరాజు మంత్రిపదవిని ఆశించారు..ఆ తర్వాత స్పీకర్ పదవిని కూడా ఆశించారు. ఈ రెండు కూడా కేబినెట్ ర్యాంకుతో కూడుకున్నవే.. కానీ వీటి బదులుగా ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగించారు. అయినా ఎటువంటి అసంతృప్తి చెందకుండా తన విధులు తన నిర్వహిస్తున్న రఘురామకృష్ణరాజు కు ఎట్టకేలకు క్యాబినెట్ హోదా దక్కడం విశేషం.













