కాంగ్రెస్ పార్టీకి మరో షాక్
కర్నూలు జిల్లాలో కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను భూస్థాపితం చేసేందుకు రఘువీరా కంకణం కట్టుటున్నారని విరుచుకుపడ్డారు. రెండు పార్టీలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న రఘువీరా ఎన్నికల్లో ఓడిపోయే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ను వీడాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అనుచరులతో చర్చించిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. కాగా బైరెడ్డి వైకాపాలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.













