ప్రభుత్వం పై తిరగబడే సమయం వచ్చింది : బైరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే సమయం వచ్చిందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాయలసీమ వాసులకు నమ్మక ద్రోహం చేస్తోందని, కర్నూలుకు ఇంతవరకు హైకోర్టు రాలేదని, బెంచ్ రాలేదని అన్నారు. తొలుత కర్నూలులోనే ఉన్న రాజధానిని తర్వాత హైదరాబాద్కు తరలించి, స్వార్థ రాజకీయ నాయకులు సీమకు తీరని ద్రోహం చేశారు. తుంగభద్ర జలాల్లో వాటా రాబట్టడంలో పాలకులు విఫలమవుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో వసలను అరికట్టలేకపోతున్నారు. ఈ నెల 28న చలో సిద్దేశ్వరం కార్యక్రమం చేపడతామని, తీగల వంతెనకు బదులుగా రోడ్ కమ్ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కృష్ణా బోర్డును విశాఖలో పెట్టాలని నిర్ణయించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. తాను చనిపోయిన తర్వాత తన అస్థికలను రాయలసీమ నదుల్లో కలపాలని నిర్ణయించానని తెలిపారు.













