జగన్ సీఎం అయ్యాకే మాకు.. అన్యాయం
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఈనెల 28న చల్లో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని చెప్పిన సీఎం జగన్, రాయలసీమకు ఏమీ చేయలేదని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాకే మాకు అత్యంత అన్యాయం జరిగింది. అప్పర్ భద్ర వల్ల రాయలసీమ, నాశనమవుతోందని కేంద్రానికి ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే దిక్కలేదు. చిన్న వయసులో సీఎం అయిన జగన్ ఇంత ఘోర వైఫల్యమా?. కడప ఉక్కు ఫ్యాకర్టీకి శంకుస్థాపన తప్ప చేసిందేమీ లేదు. కొంతమంది బైరెడ్డి అనే పేరుతో తోలు కప్పుకొని దండాలు చేస్తున్నారు. కుటుంబాల్లో జగన్ చిచ్చు పెడుతున్నారు. పెదనాన్న, చిన్నాన్నలపైకి అబ్బాయిలను ఎగదోస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.













