ప్రతి గ్రామానికి 2023 నాటికి… అన్లిమిటెడ్
2023 మార్చి నాటికి గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్, అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్ పంపిణీ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. అన్ని గ్రామాల్లో సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలు ఉండాలని అధికారులను ఆదేశించారు. సొంత ఉళ్లలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఏస్పీడ్ కనెక్షన్ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండాలన్నారు. నిర్ణీత వ్యవధిలో ఈ పనులన్నీ పూర్తి కావాలని అన్నారు. రాష్ట్రంలోని తుపాను ప్రభావిత 108 గ్రామాల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయాలి. వచ్చే ఏడాది జనవరి 9న అమ్మఒడి పథకంలో ల్యాప్‌టాప్‌లు కోరుకున్నవారందరికీ అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 9 నుంచి 12వ తరగతి గల విద్యార్థులకు ల్యాప్‌టాప్ ఆప్షన్ ఉంది. ల్యాప్‌టాప్‌లతో పాటు గ్యారెంటీ, వారంటీ కార్డులివ్వాలని తెలిపారు. ల్యాప్‌టాప్ చెడిపోతే సర్వీస్ సెంటర్‌కు పంపి వారంలో తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో ల్యాప్‌టాప్ సర్వీస్ సెంటర్లు ఉండాలి అని అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మంత్రి బాలినేని, ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు.













