ఇది భారతదేశ చరిత్రలోనే తొలిసారి
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఐదు చోట్ల రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆదేశించడం అన్యాయమని ముడా చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తరహాలో రీ పోలింగ్‌కు వెళ్లడం భారతదేశ చరిత్రలోనే తొలిసారి అని అన్నారు. పోలింగ్ ముగిసిన రెండు మూడు రోజుల్లో రీపోలింగ్‌కు వెళ్లడం ఆనవాయతీ అని.. వైసీపీ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రీపోలింగ్‌కు ఆదేశించారన్నారు. దేశంలో ఎన్నికల సంఘం అంటే ఒక మర్యాద, గౌరవం ఉన్నాయని, ఈసారి ఎన్నికల సంఘం విధానాలు ప్రపంచ దేశాలే విస్తుపోయేలా ఉన్నాయని ఆయన విమర్శించారు.













