మంత్రి బుగ్గనకు చేదు అనుభవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా డోన్‌లో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగానే మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసరా చెక్కుల పంపిణీ కోసం డోన్‌లో ఓ పంక్షన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మహిళల్ని తరలించారు. ఎండ బాగా ఉండటం, కూర్చోవడానికి కుర్చీలు సహా కనీస సౌకర్యాలు లేకపోవడంతో మహిళలు ఇబ్బందిపడ్డారు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా మంత్రి మాట్లాడుతుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.













