ఆంధ్రప్రదేశ్ అప్పులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన
వైసీపీ హయాంలో కేవలం 3 శాతమే అప్పులు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఎఫ్ఆర్బీఎం, విద్యుత్ సంస్కరణల అమలుతో అదనపు రుణాలకు అనుమతి లభించిందన్నారు. నాలుగేళ్లలో రెవెన్యూ రాబడి కూడా 16.7 శాతం పెరిగిందన్నారు. వైసీపీ వచ్చాక రాష్ట్ర స్థూలా ఉత్పత్తి రూ.11 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. డిస్కమ్లతో పాటు ఇప్పటివరకు రూ.7వేల కోట్ల అప్పు తీర్చామన్నారు. రాష్ట్రం ఇచ్చిన లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐ ధ్రువీకరించినవే అని బుగ్గన స్పష్టం చేశారు. ప్రజాపద్దులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం రూ.3,417 కోట్లు బకాయిపడిరదన్నారు. పార్లమెంట్లో కేంద్రం ప్రకటించినట్లు రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ రూ.28,466 కోట్లు అప్పు తీసుకోలేదని తెలిపారు. ఉద్యోగుల పీఎఫ్, ఇతర డిపాజిట్లు వాడుకున్న మాట వాస్తవమే అని మంత్రి వెల్లడించారు.













