ఏపీ ఎన్ ఆర్ టీకి అన్నీ వర్గాల మద్దతు – బుచ్చిరాంప్రసాద్
సుమారు 100 దేశాల్లో ఉన్న 50 లక్షల మంది ప్రవాసులు, తెలుగువారి సమన్వయం కోసం ఉద్దేశించిన ఏపీఎన్ఆర్టీకి కీలక వర్గాల మద్దతు పెరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేత త్వంలో ఏర్పడిన ఏపీ ఎన్నార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రవాస తెలుగు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీఎన్ఆర్టీ చీఫ్ కో ఆర్డినేటర్ బుచ్చి రాంప్రసాద్ విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏపీఎన్ఆర్టీకి అన్నివర్గాల హామీ ఇచ్చారు. విజయవాడ రోటరీక్లబ్ మిడ్‌టౌన్ సారథ్యంలో ప్రవాసుల సంక్షేమం గురించి కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీ చీఫ్ కో ఆర్డినేటర్ బుచ్చి రాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రవి వేమూరు నాయకత్వంలో ఏర్పడిన ఎన్ఆర్టీ కొద్దికాలమే అయినప్పటికీ సుమారు 100 సంస్థలను ఏపీకి రప్పించిందని వివరించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో కీలకనగరాలైన అమరావతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఆయా సంస్థల్లో కొన్ని తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, మరికొన్ని తమ కార్యాచరణను ఏర్పాటు చేయనున్నాయని వివరించారు. ఈ సంస్థల కారణంగా రాష్ట్రానికి రూ.500 కోట్ల పెట్టుబడులు తద్వారా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఏపీఎన్ఆర్టీ చీఫ్ కో ఆర్డినేటర్ బుచ్చి రాంప్రసాద్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలతో సంబంధాలు నిర్వహిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడంపై ఎన్నార్టీ ద ష్టి పెట్టిందన్నారు.
సుమారు 100 దేశాల్లో ఉన్న 40 లక్షల మంది తెలుగువారికి.. రాష్ట్రానికి మధ్య వారధిగా నిలుస్తోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసీయులను భాగస్వామ్యం చేసి పల్లె సీమల అభివ ద్ధికి బాటలు వేసిందని బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. ఈ సమావేశం సందఠంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఏపీఎన్ఆర్టీ ప్రవాసుల సంక్షేమానికి కీలక చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. ఈ నేపథ్యంలో ఏపీఎన్ఆర్టీకి సహకారంగా ఉండాలని నిరయించుకున్నట్లు వివరించారు. రోటరీక్లబ్ మిడ్ టౌన్ ద్వారా ఏపీఎన్ఆర్టీకి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు.













