ఇప్పుడు వాళ్లు దూరమవుతారనే భయంతో… డబ్బులు : బీటెక్ రవి
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని కార్యకర్తలను ఇన్నాళ్లూ పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు వాళ్లు దూరమవుతారనే భయంతో డబ్బులు పంచుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని కొందరు వైసీపీ నాయకులు తమకు ఫోన్ చేసి చెబుతున్నారని తెలిపారు. పులివెందులలో టీడీపీ గెలుస్తుందనడానికి వైసీపీ అభద్రతాభావమే నిదర్శనం అని అన్నారు. గతంలో వైఎస్ షర్మిలపై ఎలాంటి కామెంట్లు చేసేవాళ్ళు కాదని, ఆమె కాంగ్రెస్లో చేరిన తర్వాతే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం జగన్ ఎంత నీచానికైనా దిగజారుతారని విమర్శించారు.













