సొంత బావ పై విమర్శలు కురిపిస్తున్న వైయస్ షర్మిల భర్త..
ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి పూనుకున్న వైయస్ షర్మిల.. తన అన్న జగన్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఆమె ఇప్పటికే పలు సందర్భాలలో జగన్ సర్కారు పనితీరుపై తీవ్రంగా విమర్శించారు. అయితే ప్రస్తుతం ఆమె భర్త అనిల్ కుమార్ కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి పై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. స్వతహాగా బ్రదర్ అనిల్ కుమార్ మంచి మాటకారి. దేవుడి ప్రచారం బ్రహ్మాండంగా చేస్తారు. అయితే ఈసారి ఆయన పాల్గొన్న పాస్టర్ల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పై చురకలు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జగన్ కి ఓట్లు వేయడానికి ముఖ్య కారణం అతను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు మాత్రమే.. అయితే జగన్ పాలనలో సువార్త సభలు నిర్వహించలేకపోతున్నాం అంటూ బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. అంతేకాకుండా జగన్ పాలనలో అందరూ ఎంతో కష్టపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో మొత్తం రాజశేఖర్ రెడ్డి కుటుంబమే జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.













