మా సీక్రెట్లు మాకు ఉంటాయి.. అవసరం వచ్చినప్పుడు బయటకు
మా సీక్రెట్లు మాకు ఉంటాయి, అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి అని క్రైస్తవ మత ప్రచారకుడు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భర్త అనిల్ కుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కలిశారు. ఇరువరి మధ్య సుమారు గంటసేపు సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ రాజకీయాలు అంటే మంచి చేయటమని, రాజకీయ జ్ఞానం తెలుసుకునేందుకు ఉండవల్లిని కలిసినట్లు తెలిపారు. హిందూ మతోన్మాదం ఈ మధ్య పెరిగిందన్నారు. తాను ఏసుప్రభుని నమ్ముకున్నాని, దేవుడు చెప్పకుండా ఏ పని చేయనని పేర్కొన్నారు. అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ బ్రదర్ అనిల్‌తో ఉన్న కుటుంబ సంబంధం నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ కలిసినట్టు వెల్లడిరచారు. రాజకీయ, కుటుంబ పరిస్థితులపై చర్చించామన్నారు. భీమవరం వెళుతూ తను కలిశారని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టం పుస్తకాన్ని అనిల్‌కు అందజేసినట్లు తెలిపారు.













