బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు.. దీనిపై ఆలోచించి నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రైస్తవులు, బీసీలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని క్రైస్తవ మత ప్రచారకుడు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. విశాఖలోని ఓ హోటల్లో క్రైస్తవ, బీసీ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ పెట్టమని అన్ని సంఘాల వాళ్లు కోరుతున్నారని దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ పెట్టడమనేది ఆషామాషీ వ్యవహారం కాదని, చాలా సీరియస్ వర్క్ చేయాలని అన్నారు. ఈ సంఘాల వాళ్లంతా తన కోసం పని చేశారని తాను వాళ్ల వాట వినాల్సిందేనన్నారు. ఎవరి సాయం లేకుండా ఎవరు పదవుల్లోకి రాలేరన్నారు. ప్రజలంతా పాలించమని నాయకులకు ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు.
ఎన్నికల ముందు పార్టీ కోసం కృషి చేసిన సంఘాలు, ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. పార్టీ పెట్టాలంటూ అన్ని సంఘాల వారు తనను కోరుతున్నారని, పార్టీ పెట్టడం చాలా పెద్ద విషయమన్నారు. దీనిపై సుదీర్ఘంగా ఆలోచిస్తానన్నారు. బీసీని సీఎం చేయాలని డిమాండ్ వస్తోందని, అభిమానుల కోరిక కచ్చితంగా నెరవేరుస్తాన్నారు. సీఎం జగన్ను చూసి రెండున్నరేళ్లు అయిందని, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తనకు అవసరం లేదని స్పష్టం చేశారు.













