గంజాయి తోటలో ఏపీ ముఖ్యమంత్రి..
ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో రీసెంట్ గా బయటపడ్డ డ్రగ్స్ రాష్ట్రం లో కలకలం రేపుతున్నాయి. దీని వెనుక టీడీపీ హస్తం ఉంది అని వైసీపీ ఆరోపిస్తుంటే.. ఈ దందా అంతా వైసిపి నీడలో జరుగుతోంది అని టీడీపీ ధ్వజమెత్తుతోంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఆంధ్రాలో జరుగుతున్న గంజాయి మాఫియా గురించి లోకేష్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా గంజాయి తోటలో నివసిస్తున్నాడని.. అతనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని లోకేష్ మండిపడ్డారు. జగన్ ఉన్న లొకాలిటీలో తాగునీటి సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడంలేదని లోకేష్ అన్నారు. బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి వజ్ర రెసిడెన్సి అపార్ట్మెంట్ వాసులతో ముచ్చటించిన లోకేష్ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు.
టీటీడీ అధికారంలోకి వచ్చాక ఈ గంజాయి నియంత్రణ గురించి కఠినమైన చర్యలు తీసుకుంటామని లోకేశ్ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల లోపే రాష్ట్రంలో గంజాయి అనే పదం వినపడకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.













