విశాఖ యువకునికి గూగుల్ భారీ ఆఫర్… ఏడాదికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువకుడికి అరుదైన అవకాశం లభించింది. ప్రముఖ సంస్థ గూగుల్ ఏడాదికి రూ.47.50 లక్షల జీతంతో ఉద్యోగం దక్కింది. నెల రోజుల వ్యవధిలోనే భారీ ప్యాకేజీలతో రెండు ఉద్యోగాలు సాధించాడు. అయితే ఇటీవలే గూగుల్ సంస్థలో కోడింగ్‌కు సంబంధించి ప్రత్యేకంగా క్యాంపుస్ ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూల్లో దక్కిన అవకాశంతో లెవల్-4 సీనియర్ ఇంజనీర్ పోస్టుకు విష్ణు ఎంపికయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని యాక్సించర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాదికి రూ.15 లక్షల జీతంతో విధులు నిర్వహిస్తున్నాడని విష్ణువ్యాస్ తల్లిదండ్రులు వేదవతి, సత్యనారాయణలు తెలిపారు.













