మూడు రాజధానులే.. దానికే కట్టుబడి ఉన్నాం
మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో రైతుల పేరిట రేపు జరగబోయేది రాజకీయ సభ అన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడమే టీడీపీ లక్ష్యమన్నారు. అమరావతే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పారు. పాదయాత్రలో పాల్గొన్నది టీడీపీ వాళ్లేనన్నారు. ప్రాంతీయ అసమానతలు ఉండొద్దనే మూడు రాజధానులను చేస్తున్నామన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. టీడీపీకి ఆ 29 గ్రామాలు, సామాజికవర్గమే ముఖ్యమని మండిపడ్డారు. అమరావతే కాదు అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని అన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడమే అజెండా అని మండిపడ్డారు. అమరావతి ఓ ఏటీఎం కార్డు అని సాక్షాతూ ప్రధానమంత్రే చెప్పారని గుర్తు చేశారు.













