మూడు రాజధానులపై.. త్వరలో కొత్త బిల్లు
మూడు రాజధానుల బిల్లులో చిన్నచిన్న సమస్యలు ఉండడం వల్ల వెనుక్కు తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లు ప్రక్రియ జరుగుతోందని, త్వరలోనే కొత్తబిల్లు ముందుకు వస్తుందని అన్నారు. ఒటిఎస్ కట్టవద్దని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కుప్పంలో అక్రమ మైనింగ్‌పై చంద్రబాబు కోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లవ్ ట్రాప్ అనేది వాళ్ళ ఇష్టమని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఈ విషయంలో తాను గానీ, పెద్దిరెడ్డి గానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సమాధానమిచ్చారు.













