హైకోర్టు ఇచ్చిన నోటీసులపై స్పందించిన మంత్రి బొత్స
గవర్నర్ కు తాను రాసిన లేఖల లీకేజీపై సీబీఐ విచారణ కోరుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. న్యాయస్థానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని, నోటీసులకు సమాధానమిస్తామని చెప్పారు. అమరావతిలో బొత్స మీడియాతో మాట్లాడుతూ నిమ్మగడ్డకు సంబంధించిన ఏం రహస్యాలు బయటకు వచ్చాయో తనకైతే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధ పక్రియలో రహస్యాలెందుకని ఆయన ప్రశ్నించారు. ఎవరైనా హక్కులతో పాటు బాధ్యతలూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి తాను రానంటూ నిమ్మగడ్డ చెప్పిన విషయాన్ని ఆ కమిటీయే చూసుకుంటుందని తెలిపారు.













