స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే ఈ పథకం : బొత్స
పేదలందరికీ ఉచిత ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం కలిగించేందుకే వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులకు గృహ హక్కు చేకూర్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇది బలవంతపు పథకం కాదని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకం వర్తిస్తుందని తెలిపారు. పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దీనిపై వివాదాస్పద ఆదేశాలు ఇచ్చిన అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఒక పథకం ప్రకారం టీడీపీ కావాలనే ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. పేదలపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.













