మరి వారికెందుకు ఆహ్వానం అందలేదు? : బొత్స
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడంపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడితో విందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం అందలేదని గుర్తు చేశారు. మొదటి సారి సీఎం అయిన జగన్ను పిలవకపోయినా, మిగిలిన వారు రెండు, మూడు సార్లు సీఎం అయినా మరి వారికెందుకు ఆహ్వానం అందలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.













