అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తే.. తాను చేస్తా
ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి డిమాండ్ సరైంది కాదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్న పదవికి రాజీనామా చేస్తే తాను చేస్తానని తెలిపారు. ఇద్దరం రాజీనామా చేసి ప్రజా బలం తేల్చుకుందామని సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ ఓటమిని అంగీకరించే ధైర్యం లేదని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన ఇళ్లకు సీఎం జగన్ శాశ్వత హక్కు కల్పిస్తామన్నామని తెలిపారు. దాదాపు 60 లక్షల మందికి శాశ్వత హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. డిసెంబర్లోగా 80 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు.













