విశాఖ కూడా అలాంటి ప్రాంతమే : బొత్స
మహారాష్ట్ర, తమిళనాడు రాజధానులు ముంబై, చెన్నై కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాలేనని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖపట్నం కూడా అలాంటి ప్రాంతమే అయినా ప్రమాదమేమీ లేదన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో భూసమీకరణ పేదలకు ఇళ్లను నిర్మించేందుకేనన్నారు. ఆ నగరంలో 1.76 లక్షల మంది ఇల్లులేని పేదలున్నారని తెలిపారు. శాసనమండలిలోని పాలన వికేంద్రీకరణ బిల్లుపై నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితలు కారణంగా కొంత జాప్యం జరుగుతుందని చెప్పారు. వికేంద్రీకరణకు అనుకూలమో, వ్యతిరేకమో టీడీపీ చెప్పాలని డిమాండ్ చేశారు.













