కొంత జాప్యం జరగొచ్చు.. కానీ అమలుచేస్తాం
మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం దారుణమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పినట్టే మండలి చైర్మన్ వ్యవహరించారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కుట్రలు చేసినా తమ ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తామని సృష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పంపిన బిల్లును అడ్డుకోవడం విచారకరమన్నారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల తీరు అభ్యంతరకరమన్నారు. ఈ పరిణామాల వల్ల కొంత జాప్యం జరగొచ్చు కానీ అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది చంద్రబాబు ఆలోచన అని బొత్స ఆరోపించారు.













