చంద్రబాబు కు కొంతైనా మానవత్వం ఉందా? బొత్సా సత్యనారాయణ..
వేల మందికి ఆధారమైన పెన్షన్ ను అడ్డుకోవడమే కాకుండా.. ఇప్పుడు తప్పుడు వార్తలు కూడా పుట్టిస్తున్నారు అని చంద్రబాబు పై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులకు, వృద్ధులకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా చంద్రబాబు కోసం పని చేసే ఎల్లో మీడియాపై ఆయన మండిపడ్డారు. పెన్షన్ల పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటించడం మంచిది కాదు అన్నారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీ పేరుతో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను వాడకూడదు అని ఫిర్యాదు చేసిన సంస్థ అధ్యక్షుడు నిమ్మగడ్డ రమేష్ కాదా అని బొత్స ప్రశ్నించారు. కొంతైనా మానవత్వం ఉండాలి.. ఇలా పెన్షనర్లకు డబ్బు రాకుండా ఆపితే మీకేం వస్తుంది అంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.













