మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు…. ఇదే తమ ప్రభుత్వ విధానం
మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిపై ప్రభుత్వ వైఖరి ఇదేనంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయం మా ముఖ్యమంత్రి జగన్, మా ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో చెప్పారని అన్నారు. అసెంబ్లీలో మేము సమర్థించామని, ఇదే తమ ప్రభుత్వ విధానం అని, ఇందులో మరో వాదనకు తావులేదని అన్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని బొత్స వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. 26 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.













