విశాఖ లోక్సభ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ?
విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరును ఆ పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. అక్కడి నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తామంటూ అడిగేవారు లేకపోవడంతో అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య అయిన ఝాన్సీ పేరును ప్రతిపాదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమె విజయనగరం నుంచి ఎంపీగా పనిచేశారు. విశాఖ పట్నం సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ దఫా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తామని ప్రతిపాదించడంతో ఆయనకు అక్కడ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.













