వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేశారు. సహజంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లావారికి అవకాశం కల్పిస్తుంటారు. ఇప్పుడు విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణను విశాఖ నుంచి అభ్యర్థిగా ఎంపికచేయడం గమనార్హం. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆ జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో బొత్స పేరును జగన్ ప్రకటించారు. అంతకుముందు నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.













