హైదరాబాద్ ను ఏపీలో కలిపేస్తారా? : మంత్రి బొత్స
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు, విలీన మండలాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని, గతంలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా? అని ప్రశ్నించారు. పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతోందన్నారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేదు కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని అడగగలమా? ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచమని చెప్పండి. మాకు అభ్యంతరం లేదన్నారు. సాంకేతికంగా ఇబ్బందులొస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది ఆలోచించాలన్నారు. సమస్యను పరిష్కరించునేలా ఉండాలి తప్ప రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదన్నారు. ముంపు మండలాలు, ప్రజలు ఏపీ రాష్ట్ర కుటుంబ సబ్యులు. ఆ ప్రజల బాధ్యత పూరితగా మాది. విలీన మండలాలను తెలంగాణలో కలిపేయాలని వాళ్లు అంటే, రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలని మేం కూడా డిమాండ్ చేస్తామన్నారు.













