బైజూస్ ఒప్పందం తప్పని.. ఒక్కరితోనైనా చెప్పించగలరా?: మంత్రి బొత్స
బైజూస్ ఒప్పందం తప్పని ఒక్కరితోనైనా చెప్పించగలరా? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశరాజకీయాల్లో చంద్రబాబులాంటి పనికిమాలిన నేత లేరని అన్నారు. చంద్రబాబు కేవలం తప్పుడు విమర్శలకే పరిమితమయ్యారంటూ మండిపడ్డారు. బైజూస్‌పై చంద్రబాబు అవహేళనగా మాట్లాడారు. జైజూస్ సంస్థ గురించి చంద్రబాబుకు తెలుసా? మీ అబ్బాయిని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించారు? చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇంగ్లీష్ మీడియాంలో చదవాలి. పేదలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా?. అనుభవం ఉంటే సరిపోదు. నలుగురికి ఉపయోగపడాలి. 35 లక్షల మంది విద్యార్థులకు బైజూస్‌తో ఉపయోగం. చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందని అన్నారు.
సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబులా మేం ప్రభుత్వ పాఠశాలలు మూసివేయలేదు. నాడు నేడు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నాం. మా ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థుల శాతం పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారని అన్నారు.













