మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం… త్వరలో బిల్లు పెడతాం
మూడు రాజధానులకు మేం కట్టుబడి ఉన్నామని, త్వరలో మూడు రాజధానుల బిల్లులు పెడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో తెలియదని, తీర్పు కాపీని పూర్తి చదవిని తర్వాత అన్ని విషయాలు చెబుతానన్నారు. రాజ్యాంగ పరంగా చట్టపరిధిలో చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయన్నారు. మూడు నెలల్లో ప్లాట్లు ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? ఏదైనా ప్రాక్టికల్‌గా సాధ్యపడుతుందా? లేదా? అనేది చూడాలన్నారు. హైకోర్టు తీర్పు పూర్తిగా చదివాక వీటన్నింటిపై స్పందిస్తామన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేయాలని అన్ని ప్రాంతాలు అభివద్ధి చేయాలన్నదే ప్రభుత్వ విధానం అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఈ క్షణం వరకు నిబద్ధతతోనే ఉన్నాం అని అన్నారు.













