రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం : మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ప్రధాని మోదీ సభ విజయవంతమైందన్నారు. ఏపీ ప్రభుత్వ విధానాన్ని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్ర ఆకాంక్షలను ప్రధానికి సీఎం జగన్ వివరించారని తెలిపారు. పార్టీలు కాదు డెవలప్మెంటే ముఖ్యమని సీఎం అన్నారన్నారు. గతంలో ఈ తరహా వ్యక్తిత్వం ఏ సీఎంకూ లేదని అన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలకు స్వప్రయోజనాలే ముఖ్యమన్నారు.













