వారికి సమస్యలు ఎప్పుడూ ఉంటాయి.. తీరే కోరికలు ఉంటే
ఉద్యోగులకు సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, వారికి తీరే కోరికలు ఉంటే మంచిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజల సమస్యలే ముఖ్యమని స్పష్టం చేశారు. పీఆర్సీ వల్ల ఉద్యోగులకు నష్టం జరిగిందంటూ ప్రచారం చేయటం సరికాదన్నారు. ఉద్యోగులతో చర్చించాకే పీఆర్సీపై ఉత్తర్వులు వచ్చాయని వెల్లడిరచారు. 12వ పీఆర్సీ వేయమని కోరడం తప్ప కాదని అన్నారు. ఉద్యోగులకు జీతాల రూపంలో ప్రభుత్వం రూ.80 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఉద్యోగులు కొన్ని అంశాలపై కోర్టులకు వెళ్లటం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదని, కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకెళితే ఉద్యోగులకే సమస్య అని తెలిపారు.













