వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నాం : మంత్రి బొత్స
ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లును నియమించాం. ఇద్దరు గృహ సారథలూ ఉంటారు. వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా రాజాం మండలం కంచరాంలో నిర్వహించిన రాజాం నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ జవనరి ఒకటి నుంచి కన్వీనర్లు, గృహ సారథులు క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. బీసీల గురించి గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి పదవిని అశోక్ గజపతిరాజుకు ఇప్పించుకోవడంతోనే ఆయనకు బీసీలపై ఉన్న ప్రేమెంతో తెలిసిపోయింది అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు వైసీపీ, టీడీపీ మధ్య కాదని అని అన్నారు. పేదోడికి, దోపిడీదార్లకు, బలహీనవర్గాలకు, పెత్తందార్లకు మధ్యేనన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామంటే అమరావతిలోనే అంతా ఉండాలని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు.













