ఇది మా పార్టీ విధానం.. వెనక్కి తగ్గేది లేదు : మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణ తప్పనిసరి అంశంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇది పార్టీ విధానమని ఆయన తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. సాంకేతికంశాలను పరిగణలోకి తీసుకుని మూడు రాజధానులపై అసెంబ్లీలో త్వరలో బిల్లును పెడతామన్నారు. స్మార్ట్ మిషన్ చైర్మన్ పదవి రాజీనామా చేసిన వారికి ఇంకా పెద్ద పదవి ఇస్తామేమో అన్నారు.
ప్రభుత్వం ప్రాంతీయంగా సమగ్రాభివృద్ధికిని సీఎం జగన్ కోరుతున్నారన్నారు. అమరావతిలో రియల్ ఏస్టేట్ వ్యాపారులు, వారి బినామీదారుల తప్ప మూడు రాజధానులకు అభ్యంతరం చెప్పేవారు లేరన్నారు. సమస్యలు తలెత్తకుండా ప్రవేశపెడతామన్నారు. రాజధానుల ఏర్పాటు రాష్ట్ర పరిధిలోనిదేనన్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఖర్చుకు వెనుకంజ వేయదన్నారు. ప్రతి పేదవారికి ఇంటి స్థలాన్ని దాంతో పాటు ఇంటిని కట్టించి ఇస్తుందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల శ్రేయస్సును కాంక్షిస్తుందన్నారు. శాసనసభలో టీడీపీ సభ్యుల వైఖరి బాగోలేదన్నారు.













