ప్రతీ ప్రభుత్వానికి ఓ విధానం.. దాని ప్రకారమే
అధికారంలోకి వచ్చిన ప్రతీ ప్రభుత్వానికి ఓ విధానం ఉంటుందని, దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే 3 రాజధానుల చట్టం చేశామని అన్నారు. రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఉక్రోషంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానాల్లో ఏక్కడైనా లోపం ఉంటే మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. ఏ వ్యవస్థపైనా తాము దాడి చేయలేదని వెల్లడిరచారు. రాజ్యాంగానికి లోబడే చట్టాలు ఉంటాయని, ఏ వ్యవస్థ అయినా దాని పరిధిలోనే పనిచేయాలన్నారు. హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సభలో మాట్లాడాల్సిందని అన్నారు. టీడీపీ శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజాభిప్రాయాన్ని కోరవచ్చని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో మిగిలింది 7,300 ఎకరాలు మాత్రమేనని, అది విక్రయిస్తే రూ.లక్షల కోట్లు వస్తుందా? అని ప్రశ్నించారు.













