చంద్రబాబు హైదరాబాద్లో ఎందుకున్నారు? : మంత్రి బొత్స
అమరావతి రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, సీఆర్డీఏ చట్టం ప్రకారమే ముందుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తానెవరినీ విమర్శించలేదని, ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అమరావతి రాజధాని అని కేంద్రానికి పంపి అప్పుడే ఆమోదింప చేసుకుని ఉండాల్సిందని, చంద్రబాబు అలా చేయలేదన్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఎందుకున్నారు? అమరావతికి ఎందుకు రాలేకపోయారు? అమరావతి అడ్రస్ లేకుండా ఐదేళ్లు సీఎంగా పాలించడం దురదృష్టకరం అన్నారు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని విభజన చట్టం చెప్పిందని, అంతేగానీ తాము హైదరాబాద్ వెళ్తామని చెప్పలేదని పేర్నొన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్ విషయాన్ని ప్రస్తావించాను. అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించుకున్నామని, దానికి అనుగుణంగానే అభివృద్ధి చేస్తామన్నారు.













