ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన : మంత్రి బొత్స
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముమ్మాటికీ వికేంద్రీకరణే వైసీపీ ప్రభుత్వ విధానమని ప్రతిపక్షాల అభిప్రాయాలు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. శివరామకృష్ణ కమిషన్ కూడా వికేంద్రీకరణే సూచించిందని పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని ప్రకటించారు. స్వార్థం కోసం పోలవరాన్ని, ప్రత్యేక హోదాను తెలుగుదేశం పార్టీ తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు. జిల్లాల పునర్విభజనపై వచ్చిన విజ్ఞప్తులను కమిటీ పరిశీలిస్తోందని అన్నారు.













