రాష్ట్రంలో తప్పకుండా మూడు రాజధానులు : బొత్స

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తప్పకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేసి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే వైఎస్సార్‍సీపీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2 ఏళ్ల పాలనపై సీఎం జగన్ విడుదల చేసిన బుక్‍లెట్‍ను ప్రతి లబ్దిదారుడికి పంపిస్తామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తోందన్నారు. రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ ఆశీస్సులను సీఎం జగన్‍కు సంపూర్ణంగా అందించాలని కోరారు. టీడీపీ నేత లోకేష్ ఆరోపణలన్నీ పిచ్చి మాటలని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ఏది తప్పారో నిరూపించాలని లోకేష్‍కు సవాల్ విసిరారు.