అమరావతిని అభివృద్ధి చేస్తాం: బొత్స
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం తుది అంకానికి చేరుకుంటున్న సూచనల నేపధ్యంలో అమరావతి రైతులను శాంతపరిచే, బుజ్జగించే ప్రయత్నాలు మొదలైనట్టు కనిపిస్తోంది. తాజాగా అమరావతిపై రాష్ట్ర మంత్రి బొత్ససత్యన్నారాయణ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధిపై సిఎం సమీక్ష నిర్వహించారని ఆయన తెలిపారు. అమరావతిలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. భూములు ఇచ్చిఅందుకు బదులుగా ప్లాట్లను డెవలప్ చేసి అమరావతిలో రైతులకు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. తమకు రియల్ ఎస్టేట్ వారా, రైతులా అనేది కాదని అమరావతి అభివృద్ధే ముఖ్యమన్నారు. అమరావతి వేరే రాష్ట్రంలో లేదని అది ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమన్నారు. అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కొనసాగుతుందని చెప్పారు.













