సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చు : బొత్స సత్యానారాయణ

సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని, రాజ్యాంగం, చట్టాన్ని గౌరవిస్తూనే ముందుకు సాగుతామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలన్నదే తమ విధానమని, మూడు రాజధానులపై అసెంబ్లీలో చట్టం చేశామని బొత్స గుర్తు చేశారు. కొందరు కావాలనే కోర్టులకు వెళ్లి ఆలస్యం చేశారని మండిపడ్డారు. అడ్డంకులను త్వరలోనే అధిగమిస్తామని, అభివృద్ధిపథంలోకి సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. పేదలందరికీ సొంత ఇళ్లు ఉండాలన్నదే సీఎం జగన్ సంకల్పమని, ఆ సంకల్పం ప్రకారమే ముందుకు సాగుతున్నామని బొత్స స్పష్టం చేశారు.