బీఆర్ఎస్ ప్రభావం మాపై ఏం ఉండదు
అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ రైతుల ముసుగులో టీడీపీ, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు చేస్తుంటే అమరావతి పాదయాత్ర అని మండిపడ్డారు. ఏం ఉద్దరించడానికి పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. వారికి తాము ఎందుకు సహకరించాలని నిలదీశారు. అమరావతి భూముల్ని టీడీపీ నాయకులు దోచుకున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు ఎంత దోచుకున్నారో శాసనసభ సాక్షిగా వెల్లడిరచినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్దమని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడం వాళ్ల ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిది. బీఆర్ఎస్ ప్రభావం మాపై ఏం ఉండదు అని బొత్స స్పష్టం చేశారు.













