అసలు విషయం బయటపడింది.. పాదయాత్ర వెనుక
అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ వెనుక నుంచి నడిపిస్తోందన్న విషయం బయట పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో బోగాపురం ఎయిర్పోర్ట్, గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రదానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నట్లు ప్రకటించారు. అమరావతి పాదయాత్ర ఇక కొనసాగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. ఆరు వందల మందితో వస్తున్న పాదయాత్రలో అరవై మంది కూడా రైతులు లేరన్న విషయం బయట పడిందన్నారు. అందుకే టీడీపీ ముసుగులో ఉన్న అమరావతి రైతుల పాదయాత్రను ఆపేశారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆకాంక్ష విశాఖ పరిపాలనా రాజధాని ఇక సాకారం అయినట్టేనన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానికి ఉన్న అడ్డంకులు త్వరలోనే పరిష్కరమవుతాయన్నారు.













