నాకు నేనే సాటి.. లేదు పోటి.. ఆర్కే రోజా..
ఆంధ్రాలో ఎన్నికల హడావిడి పీక్స్ లో ఉంది.. ఎత్తుల కు పై ఎత్తులతో నేతలు తలలు పగల కొట్టుకుంటున్నారు. మీ గోల మీది.. ఎలా అయినా చావండి.. నాకెందుకు.. నా దారి నాది అన్నట్లు ఉంది ఆర్కే రోజా పరిస్థితి. వైసీపీ గూటికి చేరిన తర్వాత తన వాక్చాతుర్యంతో ఎప్పుడు వైరల్ స్టేట్మెంట్స్ ఇస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేసే రోజా జీవితంపై పుస్తకం విడుదల అయింది. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం. ఎన్నో మలుపులతో.. ఓ సాధారణమైన కుటుంబం నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. హీరోయిన్ గా ఎదిగి.. రాజకీయ రంగంలో దూసుకుపోతున్న రోజా జీవితంపై ఓ పుస్తకం ప్రచురించారు. రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి.. అనే టైటిల్ తో పబ్లిష్ అయిన ఈ బుక్ పై సోషల్ మీడియాలో మిశ్రమ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి చేతులమీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించారు. ఎన్నికల హడావిడి మధ్యలో పుస్తకాల పంపిణీ తో రోజా బాగా బిజీగా మారిపోయింది. ఎలక్షన్ క్యాంపెయిన్ కి రోజా ఎంచుకున్న ఈ వినూత్నమైన పద్ధతి మిగిలిన వైసీపీ నేతలు కూడా ఫాలో అవుతారేమో చూడాలి.













