ఢిల్లీ పర్యటన సొంత ప్రయోజనాల కోసమే.. రాష్ట్రం కోసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు బీహార్ లాగా ఉంది, అతి త్వరలో ఏపీ మరో శ్రీలంక కాబోతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీలంక అధ్యక్షుడు ఇంటిని ముట్టడిరచినట్లే, సీఎం జగన్ ఇంటిని త్వరలో ప్రజలే ముట్టడిస్తారు అని అన్నారు. సీఎం జగన్ బాదుడే బాదుడు అనే కొత్త పథకాన్ని ప్రారంభించాడు. జిల్లాలు పెంచమని ఏ రాజకీయ పార్టీ అయిన జగన్‌ని అడిగిందా? అని ప్రశ్నించారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాల పెంపు అని అన్నారు. కొత్త జిల్లాల్లో భూముల విలువ పెంచారంటే కొత్త పన్నులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 6 నెలల్లో 30 శాతం ఇంటి పన్ను పెంచిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందన్నారు. ఎందుకు భూముల విలువ పెంచారో ఒక కారణం ప్రభుత్వం చెప్పగలదా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో రాష్ట్రానికి కుక్కలు చింపిన విస్తరి చేశారు. జగన్ ఢిల్లీ పర్యటన సొంత ప్రయోజనాల కోసమే అని అన్నారు.













