ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై.. వెంటనే
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమ హెచ్చరించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టాలి. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరులు, భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి. అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్టు చేయాలి. వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్లు దొరికినా కేసులు నమోదు చేయకపోవడం దారుణం. ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.













