ఏపీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ డ్రగ్స్ వ్యాపారం వల్ల ఏపీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీజీపీ వైసీపీ తప్పులను కప్పి పుచ్చుతున్నాడని మండిపడ్డారు. 9 వేల కోట్లు హెరాయిన్ దొరికితే ఏమీ లేదు అని డీజేపీ ఎలా చెప్పుతారని ప్రశ్నించారు. సాక్షాత్తు డీఐజీ ర్యాంకు అధికారులే గంజాయి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారన్నారు. డీఆర్ఐ అధికారులు ఆంధ్ర బోర్డర్స్ అంటే జాగ్రత్తగా వుండాలి అని పక్క రాష్ట్రాలను హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. వైసీపీ నాయకులు విచ్చల విడీగా అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.













